అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై త్వరలో బీసీసీఐ స్పష్టత
రిపోర్టర్: నరేష్
స్థలం: India
భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై రాబోయే 48 గంటల్లో స్పష్టత రానుంది. అక్టోబర్ 4తో అగార్కర్ కాంట్రాక్ట్ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది పాటు పొడిగించే అంశంపై బీసీసీఐ కీలక భేటీ నిర్వహించనుంది. బోర్డు పెద్దలతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, కాంట్రాక్ట్ పొడిగింపుపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.