సైబర్ జాగరూకత దినోత్సవం: గద్వాల జిల్లాలో అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: జోగులాంబ గద్వాల
సైబర్ జాగరూకత దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆవిష్కరించినట్లు ఎస్పీ జోగులాంబ గద్వాల (SP Jogulamba Gadwal) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక డిజిటల్ యుగంలో సైబర్ మోసాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్ లైన్ వేదికలపై మోసపోకుండా ప్రతి ఒక్కరూ పాస్, థింక్, వెరిఫై అనే నిబంధనలను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.