అర్నబ్ తుఫాను బీభత్సం: శ్రీకాకుళంలో బాహుదా నది ఉగ్రరూపంతో హైవేపై నిలిచిన రాకపోకలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Srikakulam

అర్నబ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది ఉగ్రరూపం దాల్చడంతో హౌరా చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని అధికారులు తెలిపారు. వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వందల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయని, ఆహారం, మంచినీరు అందక మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించని టోల్ యాజమాన్యం తీరుకు నిరసనగా పలాస టోల్ గేట్ వద్ద డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.