ఉద్యోగాల కొరత లేదు: భారతదేశంలో ప్రతిభ లేమి ఉందంటూ బింజెలాబ్స్ వ్యవస్థాపకుడు దివ్య అగర్వాల్ సంచలనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
భారతదేశంలో ఉద్యోగాల కొరత లేదని, అసలు సమస్య ప్రతిభ లేకపోవడమేనని బింజెలాబ్స్ సహ వ్యవస్థాపకుడు దివ్య అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం కంటే ప్రతిభ లేమి సమస్యే ఎక్కువగా ఉందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు. అభ్యర్థుల్లో సరైన నైపుణ్యాలు, వృత్తిపరమైన నిబద్ధత కొరవడ్డాయని కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం డిగ్రీలు ఉండటం సరిపోదని, వాస్తవంగా పని చేసే సత్తా ఉండాలని ఆయన తేల్చిచెప్పారు.