సినిమా విశేషాలు: బిగ్ స్క్రీన్ పై నన్ను చూసుకోవడం ఎక్సయిటింగ్‌గా ఉంది
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తొలిసారి లీడ్ హీరోయిన్గా నటిస్తున్న దొంగ నా కొడుకు సినిమాతో బిగ్ స్క్రీన్ పై నన్ను నేను చూసుకోబోతున్నందుకు ఎక్సయిటింగ్‌గా ఉందని కథానాయిక సుష్మితా శెట్టి వెల్లడించారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో శ్రీను కంబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇందులో తన పాత్ర చాలా క్యూట్‌గా, బబ్లీగా ఉంటుందని తెలిపారు.