సింగరేణి కార్మికులకు జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు అందజేస్తామన్న మంత్రి పొంగులేటి

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలంగాణలోని సింగరేణి ప్రాంతాలలో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన కార్మికులకు వైఎస్సార్ ప్రభుత్వ హయాంలోని జీవో 76 ప్రకారం ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని కోల్ బెల్ట్ ప్రాంతాలకు చెందిన దాదాపు 22 వేల మంది కార్మిక కుటుంబాలు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో శనివారం కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలతో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం ఈ పట్టాల పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.