నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలంటూ కొండా సురేఖ హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: వరంగల్

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. స్థానికంగా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను తీవ్రంగా పరిగణించిన ఆమె, పార్టీ నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మహిళా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.