బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో సెల్ఫీలకు విదేశీ ప్రతినిధుల పోటీ

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ క్రేజ్ మరోసారి స్పష్టమైంది. బిజినెస్ ఫోరమ్ వేదికగా విదేశీ డెలిగేట్లు మోదీతో ఫొటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని వారితో సరదాగా ఫొటో దిగారు. ఈ సమయంలో రష్యా, ఇరాన్ అధ్యక్షులు పక్కకు జరిగి దారిచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.