రఘునాథపాలెంలో అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
రఘునాథపాలెం మండలం పుఠానితాండలో రూ.330.92 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించి, అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు.
మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం, మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.