ముంబై డిపోలో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన పది సీఎన్జీ ఏసీ బస్సులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబై

ముంబై సెంట్రల్లోని అనిక్ బస్ డిపోలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పది సీఎన్జీ ఏసీ మిడీ బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా చెలరేగిన మంటలను నాలుగు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.