హైదరాబాద్ లో నీటి సంక్షోభం: ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
భాగ్యనగరంలో తలెత్తుతున్న తాగునీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు మురుగునీటిని శుద్ధి చేసి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించిందని అధికారులు తెలిపారు. నవంబర్ ఒకటి నుంచి తొలి విడతగా ఇరవై ఒక్క ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు. భవనాల నిర్మాణం, తోటపని వంటి అవసరాలకు ఈ నీటిని వాడుకోవచ్చని, ఐదు వేల లీటర్ల ట్యాంకర్ కు నాలుగు వందల రూపాయల ధర నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.