అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల భయాలు: అస్థిరతకు అవకాశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు వచ్చే వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అమెరికా - ఇరాన్ మధ్య దౌత్య చర్చల్ లో అనిశ్చితి కొనసాగుతుండటం, హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ముప్పు తొలగకపోవడంతో ధరలు మరింత పైపైకి చేరొచ్చని చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.