అనకాపల్లిలో రూ.16.59 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే కొణతాల

రిపోర్టర్: సునీల్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి పట్టణంలోని 82వ వార్డులో రూ.16.59 కోట్లతో 41 అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.