జన్నారంలో సర్ నోటీస్ హియరింగ్ ప్రక్రియ పరిశీలన
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామపంచాయతీలో జరుగుతున్న సర్ నోటీసు హియరింగ్ ప్రక్రియను తహసిల్దార్ బక్కయ్య, సర్పంచ్ సుష్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలపతి, పంచాయతీ ఈవో రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్, వార్డు సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.