కరువు మండలాలుగా ప్రకటించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాయకుల ధర్నా

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ప్యాపిలి

వర్షాభావంతో పంటలు నష్టపోయిన ప్యాపిలి, డోన్, బేతంచెర్లను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్యాపిలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలని, హంద్రీ–నీవా నీటితో చెరువులను నింపాలని వారు కోరారు.