ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్ నుంచి బదౌన్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.