మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్లలో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, పరిపాలనాధికారి డాక్టర్ శివరామకృష్ణ తదితరులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలు దేశ ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. అనంతరం విద్యార్థులు మరియు వాలంటీర్లు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు.