నిషేధిత భూముల పరిష్కారంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పెద్దల భారీ స్కెచ్!

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్య పరిష్కారం పేరుతో రూ.లక్షల కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ పన్నాగం పన్నింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏడు రకాల వివాదాల క్లియరెన్స్‌కు తెరలేపగా, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై కీలక ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది.