అమెరికాలో దీపావళి వేళ ప్రవాసుడి ఆవేదన: విదేశీ బతుకులో భయంకరమైన ఒంటరితనం

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

అమెరికాలో నాలుగేళ్లుగా నివసిస్తున్న కార్తీక్ చౌహాన్ అనే ప్రవాస భారతీయుడు దీపావళి వేళ తన తీవ్ర ఆవేదనను పంచుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంచి ఉద్యోగం, లగ్జరీ కారు, సొంత ఇల్లు ఉన్నప్పటికీ పండుగ సమయంలో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో విదేశీ జీవితంలో ఎదురవుతున్న భయంకరమైన నిశ్శబ్దం, తీవ్రమైన ఒంటరితనాన్ని ఆయన ఆ వీడియోలో కన్నీటి పర్యంతమవుతూ వివరించారు.