అండర్‌సీ కేబుల్స్ భద్రత కోసం భారత్, అమెరికా భాగస్వామ్యం

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సముద్రగర్భ కేబుల్స్ భద్రత, స్థిరత్వం కోసం భారత్, అమెరికా దేశాలు కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ట్రస్ట్ చొరవలో భాగంగా చేపట్టిన ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో భారత్‌ను గ్లోబల్ సబ్‌సీ కేబుల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులను మరింత పటిష్టం చేసేందుకు ఇరు దేశాలు సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి.