విజయనగరం జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ప్రారంభం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో కంటే ఈసారి అధికంగా డెబ్బై ఆరు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. గ్రామాల్ లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.