పోషణ మాసం వేడుకలు విజయవంతం: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హన్మకొండ

జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించిన పోషణ మాసం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పోషణ మాసం అన్నప్రాసన వేడుకల్లో భాగంగా చిన్నారికి బాలామృతం పరిచయం చేయడం ప్రత్యేక క్షణమని పేర్కొంటూ కలెక్టర్ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించామని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి.