పెద్దపల్లిలో అక్టోబర్ 1న భారీ జాబ్ డ్రైవ్ అంటూ కలెక్టర్ ప్రకటన

రిపోర్టర్: సతీష్ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీన పెద్దపల్లిలో భారీ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. ఈ సదావకాశాన్ని జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధి శాఖ మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కొనసాగనుందని అధికారులు స్పష్టం చేశారు.