జపాన్ లో కొత్త ట్రెండ్: సొంత పేరెంట్స్ కు దూరమవుతున్న యువత
రిపోర్టర్: అశోక్
స్థలం: జపాన్
సొంత తల్లిదండ్రులకు పూర్తిగా దూరమవుతూ జపాన్ దేశంలో కొత్త సామాజిక సంప్రదాయం వేగంగా విస్తరిస్తోందని ఎల్ఎన్ఎం సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధులైన పేరెంట్స్ బాధ్యతలను చూసుకోవడానికి యువత ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్ననాటి వేధింపులు, చేదు అనుభవాల కారణంగానే ముప్ పై ఏళ్లలోపు యువతీయువకులు కుటుంబ సంబంధాలకు గుడ్‌బై చెబుతూ తమ మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు.