కేరళలో దారుణం: సామూహిక అత్యాచార కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: Thrissur
కేరళలోని త్రిశ్శూర్లో సంచలనం సృష్టించిన అపహరణ మరియు సామూహిక అత్యాచారం ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు త్రిశ్శూర్ సిటీ పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ వెల్లడించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడి భార్యే స్వయంగా ఈ దారుణానికి పథకం వేసి, నలుగురు నిందితులతో కలిసి బాధితురాలిని అపహరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.