అంతర్జాతీయ టీ20లో అతిపిన్న వయసులో సెంచరీ సాధించిన ప్రిటోరియస్
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ ప్రిటోరియస్ నమీబియాతో జరిగిన మ్యాచ్లో 101 పరుగులు చేసి, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా (20 ఏళ్ల 161 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ రికార్డును ఆయన అధిగమించారు. ఈ నేపథ్యంలో, భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ఈ రికార్డును బద్దలు కొడతారా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.