గురుకులంలో ఉత్సాహంగా సాగిన టీ ఎల్ యం మేళా ప్రదర్శన
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లిలోని కాసిపేట గురుకుల కళాశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో టీ ఎల్ యం మేళా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ బోధనాంశాలను నిజ జీవితానికి అన్వయిస్తూ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలోని సందేహాలు నివృత్తి అవుతాయని, చదువులో రాణించేందుకు ఇవి దోహదపడతాయని ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మేళాలను ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.