దేశవ్యాప్తంగా నేడు బ్యాంకుల సమ్మె.. నాలుగు రోజులు బంద్

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

ప్రధాన డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా నేడు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం సమ్మె, శనివారం రెండో శనివారం, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం వినాయక చవితి పండుగ కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఐదు రోజుల పని దినాల అమలు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసమే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ ఆందోళన చేపట్టింది.