కేరళ హైకోర్టు సంచలన తీర్పు: మైనర్ బాలిక గర్భం తొలగింపునకు అనుమతి
రిపోర్టర్: సురేష్
స్థలం: కేరళ
అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల మైనర్ బాలికకు ఉన్న ముప్పై వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించడానికి కేరళ హైకోర్టు అనుమతించిందని జస్టిస్ హరిశంకర్ వి. మీనన్ వెల్లడించారు. బాలిక మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందనే వైద్య నివేదికను పరిశీలించి తల్లి పిటిషన్ను ఆమోదించినట్లు తెలిపారు. శిశువు బతికితే రెండు నెలల పాటు చికిత్స బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, లిఖితపూర్వక అంగీకారంతో ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.