'బీఆర్ఎస్ అంటే భూమి రాక్షసుల సమితి': బండి సంజయ్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ అంటే భూమి రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కొద్దిమంది బీఆర్ఎస్ నేతల భూ కుంభకోణాలను బయటపెట్టేందుకే గంట సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లక్షలాది మంది నిరుపేదలకు ఇల్లు కాదు కదా కనీసం చిన్న స్థలం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.