కేబినెట్లోకి విజయశాంతి? మంత్రి పదవిపై జోరుగా చర్చ
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొండా సురేఖ స్థానంలో మహిళా నేతకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు సమాచారం అందుతోంది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి కట్టబెట్టి, పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.