పెట్రోల్ బంకుల్లో ఐఓసీఎల్ నీళ్ల వ్యాపారం: త్వరలో సొంత బ్రాండ్ వాటర్ బాటిళ్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్వర్క్లోని పెట్రోల్ బంకుల్లో సొంత బ్రాండ్తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం థర్డ్-పార్టీ కంపెనీల నుండి ఆసక్తి వ్యక్తకరణ దరఖాస్తులను ఆహ్వానించినట్లు వెల్లడించారు. మొదటిదశలో జాతీయ రహదారులపై ఉన్న ఔట్లెట్లలో వీటిని అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.