సంగీత దర్శకుడు అనిరుధ్ పాటలపై గంగై అమరన్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు, పాటలపై సీనియర్ దర్శకుడు గంగై అమరన్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. తమిళ సినిమా సంగీతంలో ఇప్పటి ట్రెండ్ శాశ్వతంగా నిలిచిపోయేలా లేదని ఆయన మండిపడ్డారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ స్థాయిని అనిరుధ్ అందుకోలేకపోతున్నారని, ఆయన పాటల్ లో తమిళ సాహిత్య గుర్తింపు కొరవడిందని ఒక ఇంటర్వ్యూలో గంగై అమరన్ పేర్కొన్నారు. భాషపై పట్టులేకుండానే పాటలు కంపోజ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.