రాష్ట్రంలో ప్రశాంతంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలోని తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. విజయవాడలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.