గురుగ్రామ్ ట్రంప్ టవర్స్ వివాదం: బిల్డర్ తీరుపై యజమాని తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గురుగ్రామ్
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లోని ట్రంప్ టవర్స్ లో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిన వరుణ్ సుహాగ్ అనే వ్యక్తి తనను గృహ నిర్బంధంలో ఉంచారంటూ బిల్డర్ సంస్థ ఎం3ఎం మరియు ప్రమోటర్ పంకజ్ బన్సల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అపార్ట్ మెంట్ కు వెళ్లే లిఫ్ట్ బటన్ ను నిలిపివేశారని, సందర్శకులు మరియు డెలివరీ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయారు.