ఫార్ములా ఈ రద్దు చేసి కాంగ్రెస్ దగా చేస్తోంది
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
తమిళనాడు సీఎం విజయ్ మోటార్ రేసింగ్‌ను ప్రోత్సహిస్తూ పెట్టుబడులు రాబడుతుంటే, హైదరాబాద్‌ను విశ్వ వేదికపై నిలబెట్టే ఫార్ములా-ఈ రేసింగ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేసింగ్‌ను రద్దు చేయడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.