రామారావు అకాల మరణం తీరని లోటన్న సాగర సుబ్బారావు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుకుంపేట
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కొట్నాపల్లిలో పాలిటెక్నిక్ ఉద్యోగి బద్నాయిని రామారావు అకాల మరణం చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సాగర సుబ్బారావు గ్రామానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న రామారావు కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించి మనో ధైర్యం నింపారు.