22ఏ భూముల వివాదంపై మంత్రి పొంగులేటి వితండవాదం: బీఆర్‌ఎస్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
22ఏ నిషేధిత భూముల జాబితా వివాదంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయి పలాయనవాదం ప్రదర్శించారని బీఆర్‌ఎస్ విమర్శించింది. తప్పు జరిగిందని, క్షమాపణ కోరామని గతంలో స్వయంగా అంగీకరించి, ఇప్పుడు సభలో మాట మారుస్తూ వితండవాదం చేస్తున్నారని మండిపడింది. సమస్యకు కారణమేంటో చెప్పకుండా ప్రతిపక్షాలపై నిందలు వేయడం సరికాదని, మంత్రి పొంగులేటి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.