చిన్న గంగవరం వంతెన నిర్మించాలని గ్రామస్థుల డిమాండ్

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం ధరకాండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద గతంలో తుఫాన్కు కొట్టుకుపోయిన వంతెనకు ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గాలు కూడా ఇటీవల పూర్తిగా కొట్టుకుపోవడంతో సుమారు ఇరవి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే శాశ్వత వంతెన నిర్మించి తమ ప్రాంత వాసుల రాకపోకల కష్టాలు తీర్చాలని కోరారు.