బిర్యానీలో ఇనుప వైరు ముక్క: రెస్టారెంట్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
రిపోర్టర్: వెంకట్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వడ్డించిన బిర్యానీలో ఇనుప వైరు ముక్క రావడం తీవ్ర కలకలం సృష్టించిందని మున్సిపల్ కమిషనర్ అభిలాష్ వెల్లడించారు. మాజీ ప్రజాప్రతినిధి తింటున్న సమయంలో ఈ ఘటన వెలుగుచూడటంతో ఆయన యాజమాను్యంతో వాగ్వాదానికి దిగి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకుడికి రెండు వేల రూపాయల జరిమానా విధించి కఠినంగా హెచ్చరించారు.