టాలీవుడ్ లో రా అండ్ రస్టిక్ యాక్షన్ తో రానున్న డానీ ఫస్ట్ స్ట్రైక్ టీజర్ విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నటుడు ఆశిష్ గాంధీ హీరోగా కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డానీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ స్ట్రైక్ టీజర్‌ను విడుదల చేశారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ నెలలో థియేటర్లలోకి రానుంది.