విద్యార్థి నీలాయమ్మ సత్రం భూముల అన్యాక్రాంతంపై దేవాదాయశాఖ మౌనం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం పట్టణంలో దాతలు ఉదాత్త ఆశయంతో పేద విద్యార్థుల వేద పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన విద్యార్థి నీలాయమ్మ సత్రానికి చెందిన ఏకంగా నూట ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని ఈ కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా దేవాదాయశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్రం నిర్వహణ కోసం దాత రాసిన వీలునామాను తుంగలో తొక్కి భూములు కొల్లగొడుతున్నా స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి.