భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ అరేబియా వీడిన ఫుట్బాల్ క్రీడాకారుడి సతీమణి

రిపోర్టర్: అశోక్ స్థలం: Riyadh

భద్రతా కారణాలరీత్యా సౌదీ అరేబియాను వీడి తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రిటన్ కు తిరిగి వచ్చినట్లు ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఒల్లీ వాట్కిన్స్ భార్య ఎల్లీ వాట్కిన్స్ టిక్టాక్ వీడియో ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. రియాద్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఒల్లీ వాట్కిన్స్ మాత్రం అల్-హెలాల్ క్లబ్ తరఫున సౌదీలోనే తన ఆటను కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.