అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు తీస్తామంటూ కేటీఆర్ హెచ్చరిక
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
తెలంగాణలో రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తమకు తెలుసని, తాము అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు బయటికి తీస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.