యంగ్ హీరో శ్రీ నందు కొత్త సినిమా మగాళ్లు జిందాబాద్ టైటిల్ అనౌన్స్మెంట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మాతలుగా యంగ్ హీరో శ్రీ నందు, హీరోయిన్ లక్ష్మీ దుర్గ నటిస్తున్న తాజా చిత్రం మగాళ్లు జిందాబాద్ టైటిల్ అనౌన్స్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. నారా ప్రవీణ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా సెటైరికల్ కామెడీ నేపథ్యంలో సాగుతుందని, మగవాళ్ల నిజ జీవిత సమస్యలను వినోదాత్మకంగా చూపించడమే ఈ చిత్ర ఉద్దేశమని చిత్ర యూనిట్ వెల్లడించింది.