గిన్నీస్ రికార్డు సాధించిన కరాటే మాస్టర్కు వరంగల్ సీపీ అభినందనలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హన్మకొండ

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన కరాటే మాస్టర్ ధామేర శంకర్ను వరంగల్ సీపీ ఎన్.శ్వేత అభినందించినట్లు Warangal Police వెల్లడించారు. చెన్నైలో నిర్వహించిన కరాటే పోటీల్లో నిరవధికంగా ఆరు గంటల పాటు అద్భుతమైన ప్రదర్శన నిర్వహించి ఆయన ఈ ఘనత సాధించారని తెలిపారు. మరోవైపు తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పతకాలు సాధించిన పన్నెండు మంది పోలీసు క్రీడాకారులను కూడా సీపీ అభినందించారని కమిషనరేట్ వర్గాలు పేర్కొన్నాయి.