అరేబియా సముద్రంలో సాహసోపేత ఆపరేషన్: ఇరాన్ సిబ్బందిని రక్షించిన భారత నావికాదళం
రిపోర్టర్: గోపి
స్థలం: Arabian Sea
సోమాలియా తీరంలో సాయుధ సముద్రపు దొంగల చేతిలో అపహరణకు గురైన అజిని ఫిషింగ్ నౌక నుంచి ఇరవై మంది ఇరాన్ సిబ్బందిని భారత నావికాదళం విజయవంతంగా రక్షించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ముంబైకి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో నలభై ఎనిమిది గంటల పాటు ఈ సాహసోపేత ఆపరేషన్ కొనసాగిందని, వైమానిక దళం కూడా సహకారం అందించిందని ఆయన వెల్లడించారు. నౌకను మదర్ షిప్ లాగా వాడకుండా ముందస్తుగా అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.