రష్యా సైన్యంలో భారతీయుల రిక్రూట్మెంట్పై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా మోసపూరిత హామీలతో భారత్ సహా 47 దేశాల పౌరులను బలవంతంగా యుద్ధ రంగంలోకి లాగుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. మెరుగైన ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి యుద్ధ భూమికి తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.