మున్సిపల్ పోలింగ్ వేళ మద్యం షాపులపై ఆంక్షలు విధించిన అధికారులు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో నవంబర్ మొదటి తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కౌంటింగ్ జరిగే నవంబర్ మూడో తేదీన సైతం వైన్ షాపులు మూతపడనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.