డీసీ స్టూడియోస్ క్లేఫేస్ సినిమా నుంచి ఫైనల్ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీసీ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన క్లేఫేస్ సినిమా చివరి ట్రైలర్ విడుదలైంది. జేమ్స్ వాట్కిన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ రైస్ హారిస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక యువ నటుడి జీవితం ఊహించని మలుపు తిరగడం, ప్రయోగాత్మక వైద్య చికిత్సతో అతడు రాక్షస రూపం దాల్చడం వంటి భయానక అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 23వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.